lock down love story in Telugu
ఎర్రటి ఎండలో బస్సు స్టాప్ దగ్గర ఒక 25 ఏళ్ల అబ్బాయి వచ్చిపోయేవాళ్లందర్నీ అడుగుతున్నాడు కాదు కాదు అడుక్కుంటున్నాడు ఒక వంద రూపాయలిమ్మని . వచ్చి పోయే వాళ్లందరితో తన సమస్యలన్నీ ఏకరువు పెడుతున్నాడు. అన్నం తిని మూడు రోజులైంది ఒక వందిమ్మనీ ఒకరిని అడిగాడు అతను పైకి ఎగాదిగా చూసి ఏమయ్యా అడ్డగాడిదల బలిసావు చూడ్డానికి చదువుకున్నవాడిలా వున్నావు నీకు అడుక్కోవడానికి సిగ్గుగాలేదు అన్నాడు , లేదు సార్ , మీదగ్గరుంటే కొంచెం అప్పుగా ఇస్తారా అన్నాడు . దాంతో అతను చిర్రెత్తుకొచ్చి ఏమి అనలేక కోపాన్ని బిగబట్టుకొని వెళ్ళాడు . తర్వాత ఒక అంటీని అడగబోయాడు ఆంటీ ఆంటీ ఒక వందరూపాలు ఇవ్వండి అని అడగడం పూర్తయ్యేలోపే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె . నెక్స్ట్ తననే అడుగుతాడేమో అని అడగక ముందే పక్కకి జరిగాడు ఇంకొకతను . అతడ్ని అడిగి లాభం లేదని ఆ పక్కనే వున్న మరొకతన్ని అదే పనిగా అన్న అన్న అన్న .... ప్లీజ్ ... అన్న అన్న..... . కట్ చేస్తే బెడ్ మీదనుండి హఠాత్తుగ లేచిన మనోజ్ కళ్ళు మూసుకొ నే వున్నాడు. అదే పనిగా గ్యాప్ లేకుండా అన్న అన్న ఒక వంద ..... అని తన కుడి చేయి ముందుకు ఉంచి చూపుడు వేలు బొటన వే...