lock down love story in Telugu

     ఎర్రటి ఎండలో బస్సు స్టాప్ దగ్గర ఒక 25 ఏళ్ల అబ్బాయి వచ్చిపోయేవాళ్లందర్నీ అడుగుతున్నాడు కాదు కాదు అడుక్కుంటున్నాడు ఒక వంద రూపాయలిమ్మని . వచ్చి పోయే వాళ్లందరితో తన సమస్యలన్నీ ఏకరువు పెడుతున్నాడు. అన్నం తిని మూడు రోజులైంది ఒక వందిమ్మనీ ఒకరిని అడిగాడు అతను పైకి ఎగాదిగా చూసి ఏమయ్యా అడ్డగాడిదల బలిసావు చూడ్డానికి చదువుకున్నవాడిలా వున్నావు నీకు అడుక్కోవడానికి సిగ్గుగాలేదు అన్నాడు , లేదు సార్ , మీదగ్గరుంటే కొంచెం అప్పుగా ఇస్తారా అన్నాడు . దాంతో అతను చిర్రెత్తుకొచ్చి ఏమి అనలేక కోపాన్ని బిగబట్టుకొని వెళ్ళాడు . తర్వాత ఒక అంటీని అడగబోయాడు ఆంటీ ఆంటీ ఒక వందరూపాలు ఇవ్వండి అని అడగడం పూర్తయ్యేలోపే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె . నెక్స్ట్ తననే అడుగుతాడేమో అని అడగక ముందే పక్కకి జరిగాడు ఇంకొకతను . అతడ్ని అడిగి లాభం లేదని ఆ పక్కనే వున్న మరొకతన్ని అదే పనిగా అన్న అన్న అన్న .... ప్లీజ్ ... అన్న అన్న..... 
 
.

 కట్ చేస్తే



బెడ్ మీదనుండి హఠాత్తుగ లేచిన మనోజ్ కళ్ళు మూసుకొ నే వున్నాడు. అదే పనిగా గ్యాప్ లేకుండా అన్న అన్న ఒక వంద ..... అని తన కుడి చేయి ముందుకు ఉంచి చూపుడు వేలు బొటన వేలును రాపిడి చేస్తూ అడుగుతూనే వున్నాడు. ఇంతలో మనోజ్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చింది. కొడుకు అలా అడుక్కోవడం చూసి అవాక్కయింది. మన మనోజ్ ఇంకా ఆపట్లేదు అలా అన్న అన్న ప్లీజ్ అన్న .... అని అంటునే వున్నాడు . ఒక్క కుదుపు కుదిపింది అమ్మ మనోజ్ని మనోజ్ మనోజ్ అని . దాంతో ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు మనోజ్. ఒక్కసారి కళ్ళు తడుముకొని చూసాడు . టీవిలో చాగంటిగారి ప్రవచనాలు వినపడ్తున్నాయి హాళ్ళో నుండి. తాను ఇంట్లోనే వున్నానని నిర్ధారణకు వచ్చాడు. ఇదంతా కలా అని అనుకున్నాడు . మరీ ఇంత దరిద్రంమైన కల వచ్చిందెదబ్బా అని మొహం చిట్లించుకున్నాడు. లేరా లే పీడకలేమైనా వచ్చిందా ఏందీ ఇట్ల కలవరిస్తివి. పో పోయి మొహం కడుక్కో .చాయ్ పెడుతున్న తాగుదువుగాని అంది. అది పీడకల కాదు అమ్మ దరిద్రపు కల అని తనలో తానే అనుకొని ముందుకు కదిలాడు . అదే రూంలో ముందు నుండి ఇదంతా గమనిస్తున్న మనోజ్ నాన్న నువ్ ఇందుకు తప్ప మరెందుకు పనికి రావురా అన్నట్టు చూసాడు . కొంచెమ్ వెకిలి సిగ్గు నటిస్తూ ఈసారి ఎలాగైనా జాబ్ కొడ్తా నాన్న అని చిన్నగా గొణుగుకుంటూ వెళ్ళిపోతాడు బ్రష్ చేసుకోడానికి.
జాబ్ లేకపోతే ఆ కలలాగానే ఉంటదేమో మన పరిస్థితి అని అనుకుంటుంటాడు . 
      
     మనోజ్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్. పూర్తిచేసాడు. బీ. టెక్ పూర్తై రెండు సంవత్సరాలైన మనోజ్కి జాబ్ రాలేదు.  జాబ్ కోసం హైద్రాబాద్లో ముమ్మరప్రయత్నాల్లో ఉండగా లాక్ డౌన్ వచ్చి పడింది .      ట్రాన్స్పోర్టేషన్ స్తంభించి పోయింది.అన్ని ఆఫీసులు వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి .  మనోజ్ కూడ ఇంటికి వచేసాడు. హైద్రాబాద్లో జాబ్ కోసం తిరుగుతున్నప్పుడు తాను ప్రత్యక్షంగా చూసిన సీన్లన్నీ ఇలా కలరూపంలో వచ్చాయన్నమాట. 

    బ్రష్ గట్ర చేస్కొని ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వచ్చాడు మనోజ్. అమ్మ ఛాయ్ అని  చిన్నగా అరిచాడు . వచ్చి పోసుకొని తాగరా నాకు చాలా పనులున్నాయ్ అంది. సరే అని వెళ్లి ఛాయ్ తెచ్చుకొని హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసాడు . ఏ ఛానెల్ పెట్టిన కరోనా న్యూసే వస్తుంది . అసలు బయటికే వెళ్లకూడదని , అత్యవసర సమయాల్లో వెళ్లినా  మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని శానిటైజెర్లు వాడాలని పదే పదే చెప్తున్నారు . మాయదారి రోగం ఎపుడు పోతదో ఏమో అని తిట్టుకుంటూ త్వరగా కరోనా అంతం అవ్వాలని మనసులో దేవుడ్ని ప్రార్థించాడు మనోజ్. 

మామూలు సమయాల్లో ఒక్కచోట కూడా కుదురుగ ఉండని మనోజ్కు లాక్ డౌన్ కావడం వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. లేకపోతే ఊరు గేరిని ఒక్కటి చేసేవాడు . ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నాడు , చెల్లెలితో కాసేపు కబుర్లు చెప్తు , అట పట్టిస్తూ వున్నాడు . ఇంకా కాసేపు ఫోన్లో , మరికాసేపు టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు . కానీ మనోజ్ ఎక్కువసేపు ఇంట్లో వుండలేకపోతున్నాడు . తనకి బయటికి వెళ్లాలని వుంది. కానీ వెళ్లలేకపోతున్నాడు . ఇంట్లో నాన్న కూడ ఉన్నాడు . కరోనా టైములో బయటికెళ్తే కాల్లు విరగ్గొడతానని ముందే చెప్పి వున్నాడు .
ఇక బయటికెళ్ళడం కష్టమని భావించాడు . తథాస్తు దేవతలు తథాస్తు అన్నారేమో అంతలోనే మనోజ్ అమ్మ వచ్చి అర్జెంట్గా నువ్వు వెళ్లి కిరణం షాపులో కొన్ని సరుకులు అదేవిదంగా రొట్టెలకోసం పిండి పట్టించుకురమ్మని ఒక డబ్బాలో ఇన్ని జొన్నల్ని కూడ ఇచ్చింది. కానీ జాగ్రత్తగా వెళ్లిరమ్మంది. అసలే కరోనా అంట ముఖానికి మాస్క్ కట్టుకొని బయటి వ్యక్తులతో భౌతిక దూరం పాటించాలంది.సరేనని తలూపి ఇప్పటికైనా కాస్త బయటికెళ్లొచ్చని ఊపిరి పీల్చుకున్నాడు. ముఖానికి మాస్క్ పెట్టుకొని వద్ద చిన్న శానిటైజర్ బాటిల్ ఒకటి ఉంచుకొని నాన్న స్కూటీ తీస్కొని బయల్దేరాడు మనోజ్. వీధులన్నీ నిర్మానుష్యంగా వున్నాయ్,    అడక్కడ ఎవరో ఒకరు తప్ప జనాలెవరు కన్పించట్లేదు. కొన్ని చోట్ల రోడ్లు బ్లాక్ చేసి వున్నారు . బహుశ అవి కంటామినేటెడ్ జోన్స్ అయి ఉండవచ్చు. ఎవరు రాకుండ అడ్డుగా పొడవాటి కట్టెల్ని కట్టారు. ఇలా వెళ్తూ వెళ్తూ అన్నీ గమనిస్తున్నాడు మనోజ్ . ఇంతలో పిండిగిర్ని వుండే ఏరియాకి చేరుకున్నాడు. పిండిగిర్ని వుండే యజమాని గేటుకి తాళం వేసి వున్నాడు ఎవరు లోపలికి రాకుండ. అంకుల్ అంకుల్ అని పిలిచాడు బయటి నుండి మనోజ్. ఎవరూ...? అంటూ బయటకి వచ్చి చూసాడు యజమాని . పిండి వేయాలన్నాడు మనోజ్. కుదరదు బాబు ఇప్పుడు పిండి వేయట్లేదు పిండిగిర్ని పనిచేయట్లేదు అన్నాడు యజమాని కాస్త మొహం చిట్లించి . ప్లీజ్ అంకుల్ , ఇంట్లో పిండి ఐపోయిందంట అని అన్నాడు . నేను ఫలానా వాళ్ళ అబ్బాయినంటూ తనను పరిచయం చేసుకున్టు వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్పాడు. వాళ్ళ నాన్నగారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల అయిష్టంగానే మనోజ్ని లోపలికి రానిచ్చాడు. స్కూటీ పక్కన పార్క్ చేసి జొన్నల డబ్బా తీస్కొని లోపలికి వెళ్ళాడు మనోజ్. గిర్ని యజమాని గిర్ని ఆన్ చేసి మనోజ్ దగ్గరున్న జొన్నల్ని అందులో పోసాడు. మనోజ్ ఆ పక్కనే వున్న అల్మార పక్కన నుంచున్నాడు ఫోన్తో టైంపాస్ చేస్తు . యజమాని అక్కడున్న పిండి డబ్బను ఒకదాన్ని అల్మారాలో పెట్టబోయాడు. మనోజ్ మధ్య మధ్యలో మాస్కును సవరించుకుంటూ వున్నాడు. గిర్నీ నుండి వచ్చే పిండి దుమ్ముకు ఒక్కసారి గట్టిగా తుమ్మాడు. దెబ్బకు గిర్నీ యజమాని ఉలిక్కిపడి అల్మారాలో పిండి డబ్బా పెట్టబోతూ జార విడిచాడు . దాంతో డబ్బాతో సహా పిండి మొత్తం మనోజ్ తల మీద పడింది . పిండి మనోజ్ తల పైనుండి ధారగా కారుతుంది . ఆ పిండి ధార సందుల్లోంచి ఒక అందమైన నవ్వు కనపడుతుంది. 
 కొబ్బరి చెట్ల కొమ్మల మధ్య మెరిసే జాబిల్లిలా ఆ నవ్వు మెరుస్తుంది. తలమీద పడిన పిండిని దులుపుకుంటూ ఆమెను చూస్తూనే ఉన్నాడు . ఇది వరకెపుడు చూడలేదు అంత అందమైన నవ్వుని మనోజ్. నిండు పున్నమి చంద్రుడిలా ఉందామె ముఖం. నవ్వు ఆమె అందాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. ఆలా తదేకంగా చూస్తూనే వున్నాడు. ఇంతలో పిండి గిర్నీ యజమాని ఏంటి బాబు ఇంత గట్టిగ తుమ్మావ్ . తుమ్ము వచ్చే ముందు కాస్త బయటికెళ్లి తుమ్మొచ్చుగా అని విసుక్కున్నాడు . అరెరే పిండి అంత నెల పాలైందిగ అని చిరాగ్గా చూసాడు మనోజ్ వంక . మనోజ్ ఈ లోకంలో లేడు . ఆ అమ్మాయిని చూస్తూ ఏదో తన్మయత్వంలో వున్నాడు . మొహమంతా పిండితో నిండి వున్న మనోజ్ని చూసి నవ్వుతూనే వుంది ఆ అమ్మాయి . ఆ అమ్మాయ్ చూడటానికి నూతన పోకడలు తెలిసిన సంప్రదాయం గల అమ్మాయిల వుంది. 

మొహమంతా పిండితో నిండి వున్న మనోజ్ని చూసి నవ్వుతూనే వుంది ఆ అమ్మాయి . మనోజ్ వాలకాన్ని గమనించి ఒక్క కుదుపు కుదిపాడు గిర్నీ యజమాని మనోజ్ని . అంతే ఈ లోకంలోకి వచ్చిపడ్డాడు మనోజ్ . యజమాని ఆ అమ్మాయిని ఎం కావాలమ్మా అని అడిగాడు . తన చేతిలోని డబ్బాని చూపిస్తూ పిండి కోసం అని చెప్పేలోపు ఓహ్ పిండి కోసమా అని ఆ జొన్నల డబ్బాని అందుకున్నాడు యజమాని . మాస్కు లేని ఆ అమ్మాయిని చూసి మాస్కు పెట్టుకోవాలి కదమ్మా అని సున్నితంగా చెప్పాడు. సారి అంకుల్ , ఇంటినుండి పెట్టుకొనే వచ్చా ఇప్పుడే తీసా అని మల్లి పెట్టుకుంది మాస్కుని .
బాబు ఆ అవతారాన్ని చూడలేకపోతున్నాం వెళ్లి మొహం కడుక్కో నాయన వాటర్ వున్నాయ్ బయట అని అన్నాడు . మనోజ్ సరేనని తలూపుతూ వెళ్ళాడు కడుక్కోవడానికి . ఆ అమ్మాయి కూడ బయటకి వచ్చింది ఆ గిర్నీ నుండి వచ్చే దుమ్ముకు అక్కడ ఉండలేక . ఇంతలో మనోజ్ కూడా మొహం కడుక్కున్నాడు . 
ఇప్పుడు ఇరువురు ఒకరినొకరు చూసుకున్నారు. మాస్కు చాటున దాగిన ఆమె సిగ్గును ఇట్టే పసిగట్టాడు మనోజ్. తను కూడ సిగ్గుపడుతున్నాడు . ఇక మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. హాయ్ అన్నాడు మనోజ్. హలో అంది ఆ అమ్మాయి .మీ పేరు అన్నాడు ఎందుకు అంది. ఊరికే తెలుసుకుందామని అన్నాడు . తెలుసుకొని ఎం చేస్తావ్ అంది. అయ్య బాబోయ్ ఏంటి ఇలా రివర్స్ గేర్ ఏసింది అని అనుకున్నాడు. .... ( ఇంకా ఉంది) 
      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రేమికుల దినోత్సవం ... Do Love, Spread the Love

Best Baby care products in Telugu

ఒక్క సారి చదివి చూడండి!! .. మీకు అద్భుతమైన వ్యక్తి పరిచయం అవుతారు