ప్రేమికుల దినోత్సవం ... Do Love, Spread the Love
ప్రేమ చాలా అందమైన మాట. ఆ భావన ఒక అద్భుతం. ప్రేమించిన వారికి తెలుస్తుంది అందులోని మాధుర్యం. ప్రేమలో పెదవులు పలుకకున్న కన్నులు మాట్లాడుకుంటాయి. ఒకవేళ పెదవులు పలికినా భాష చాలదు. ఒకరికొకరు ఎదురు పడినప్పుడు బిత్తర చూపుల తత్తర మాటలతో గత్తర లేపుతుంది ఈ ప్రేమ.
క్రీ.శ. 270 లో రోమ్ లో వాలెంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచంలో శాంతి ఆనందం వెళ్లి విరుస్తాయని నమ్మేవాడు. అందుకే ఎంతో మంది యువతీ యువకులకు ప్రేమ పాఠాలు చెప్పి, ప్రేమ వివాహాలను ప్రోత్సహించేవాడు. వాలెంటైన్కీ రోజు రోజుకి అభిమానులు ఫాలోయింగ్ చాల పెరిగింది. దాంతో రోమ్ రాజు క్లాడియస్కి భయం పట్టుకుంది. దేశాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమపాఠాలు చెప్పి వారిని ఇంకా బలహీనులుగా మారుస్తున్నాడని అభియోగాలు మోపి క్లాడియస్ వాలెంటైన్ కి ఉరి శిక్ష విధిస్తాడు.వాలెంటైన్ జైల్లో వున్నపుడు జైలర్ కూతురితో ప్రేమలో పడతాడు. తాను చనిపోయేముందు " యువర్ వాలెంటైన్ " అని లెటర్ రాస్తాడు. ఇలా ప్రేమకు చిహ్నమైన వాలెంటైన్ ను ఫిబ్రవరి 14 న ఉరి తీశారు.
దాదాపు రెండు శతాబ్దాల తర్వాత క్రీ. శ. 496లో అప్పటి పోప్ గాెలాస్సియస్ ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా ప్రకటించాడు.
ఎక్కడో రోమ్ లో ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ వాలెంటైన్స్డేని నేడు ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది. అయితే ఈ సాంప్రదాయాన్ని వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు. వాలెంటైన్స్ డే మన సంస్కృతికి విరుద్ధమని, దాన్ని జరుపుకోకూడదని కొన్ని హిందుత్వ సంస్థలు హెచ్చరిస్తుంటాయి కూడ. అక్కడక్కడ కొన్ని భౌతిక దాడులు చేయడం కూడ మనం చూస్తుంటం. ఇంతకు ఈ రోజును సెలెబ్రేట్ చేస్కోవడం సబబేనా? కాదా కింద కామెంట్ చెయ్యండి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి