ప్రేమ చాలా అందమైన మాట. ఆ భావన ఒక అద్భుతం. ప్రేమించిన వారికి తెలుస్తుంది అందులోని మాధుర్యం. ప్రేమలో పెదవులు పలుకకున్న కన్నులు మాట్లాడుకుంటాయి. ఒకవేళ పెదవులు పలికినా భాష చాలదు. ఒకరికొకరు ఎదురు పడినప్పుడు బిత్తర చూపుల తత్తర మాటలతో గత్తర లేపుతుంది ఈ ప్రేమ. ఇలాంటి ఈ ప్రేమను ప్రపంచం అంత ఒక వేడుకల జరుపుకుంటుంది ఒక రోజు, అదే ప్రేమికుల రోజు . ప్రతి ఏటా ఫిబ్రవరి 14 ను ప్రేమికుల దినోత్సవముగా జరుపుకుంటారు. ఈ రోజున ఎన్నో గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్ చేతులు మారుతుంటాయి. కొంత మంది యువతీ యువకులు తమ ప్రేమను తాము ప్రేమించిన వారికి వ్యక్త పరుస్తుంటారు కూడ. అందులో కొన్ని ఆమోదించబడతాయి కొన్ని తిరస్కరించబడతాయి. ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం ఈ ప్రేమికుల రోజు . అలాంటి ఈ రోజును ఎందుకు సెలెబ్రేట్ చేసుకుంటారు? ఈ ఆనవాయితి ఎప్పటినుండి వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం క్రీ.శ. 270 లో రోమ్ లో వాలెంటైన్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచంలో శాంతి ఆనందం వెళ్లి విరుస్తాయని నమ్మేవా...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి